హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బాలాపూర్, ఖైరతాబాద్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ఈ ఏడాది 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లపాటు అని మతాల పండుగలను ఘనంగా నిర్వహించామన్నారు తలసాని. నిమర్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతుందన్నారు. వినాయక నిమర్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమర్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నందున.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.