తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూ స్ట్రాటెజీస్.. కోఆర్డినేషన్, అవేర్నెస్ డ్రైవ్‌లతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మే 31, 2023న ప్రారంభం అయిన ఈ కొత్త బ్యూరో ఎన్డి పీఎస్ కేసులు కోసం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. అలాగే కేంద్ర ఏజెన్సీలు మరియు రాష్ట్ర విభాగాలతో కోఆర్డినేట్ చేస్తుంది. గ్లోబలైజేషన్, రిటైల్ పంపిణీలో సాంకేతికత, ఆవిష్కరణ కోసం వేగవంతమైన పురోగతికి ఆజ్యం పోసింది. అయితే డ్రగ్స్ అక్రమ రవాణాకు పెడలర్స్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ.. టీఎస్ఎన్ఏబి, రాష్ట్ర పోలీసులచే యాంటీ నార్కోటిక్స్ ఆక్టివిటీస్ని కట్టడి చేస్తూన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన ఈ బ్యూరో రెండు నెలల్లో కోట్ల రూపాయల డ్రగ్స్ సీజ్ చేయగలిగింది.
జూన్, జూలై నెలల్లో 196 కేసులలో 175 గంజాయికి సంబంధించిన కేసులు బుక్ అయ్యాయి. ఇప్పటివరకు 353 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 21 ఇతర మాదకద్రవ్యాల కేసుల్లో మరో 46 మందిని అరెస్టు చేశారు. గంజాయి,ఎండీఎమ్మె,హెరాయిన్, కోకైన్, నల్లమందు,హాష్ ఆయిల్,గంజా వీడ్ ఆయిల్ ఇంజెక్షన్లు, పౌడర్ టాబ్లెట్లను వివిధ రూపాల్లో రవాణా చేస్తుండగా సీజ్ చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ 26 కోట్ల రూపాయలని అధికారులు తెలిపారు.