ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ ఉంటే చంద్రబాబే విజయం : విజయసాయిరెడ్డి

-

ఏపీలో ఓట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు. చంద్రబాబు హాయాంలోనే నకిలీ ఓటర్లను చేర్చారని వాటిని తొలగించామని వారు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. అవన్నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే చేర్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

Vijayasai Reddy dismisses allegations on Daspalla land issue-Telangana Todayధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేస్తున్నారనేదే చంద్రబాబు బాధ అని ఆరోపించారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ పెడితే చంద్రబాబు కచ్చితంగా విజయం సాధిస్తారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు ఉండాలి… పారదర్శకంగా ఉండాలనేదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. 2015 నుండి చంద్రబాబు దొంగ ఓట్లను చేర్చారన్నారు. ఈసీ రూల్స్‌ను తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు. ఇంటి నెంబర్లు, పేర్లను టీడీపీ హయాంలో ఎలా మేనేజ్ చేశారో చెప్పామన్నారు. సేవా మిత్ర, మై టీడీపీ యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈసీకి ఇచ్చామన్నారు. ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడ్డారని, ఇది నేరపూరిత చర్య అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news