ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టి ప్రజలకు మహానుభావుడిలా మారాడు. అందులో భాగంగా తాజాగా విద్యాదీవెన పధకం 8 .44 కోట్ల విద్యార్థి తల్లుల ఖాతాలలో రూ. 680 .44 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. కాగా ఈ విధంగా తల్లుల ఖాతాలో పడిన అమౌంట్ ను ఫీజు రేయింబర్సు మెంట్ కింద వారం లేదా పది రోజులలో సంబంధిత కాలేజీలకు వెళ్లి చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం తల్లితండ్రులకు తెలియచేసింది. ఒకవేళ ఎవరికైనా సరైన ఇన్ఫర్మేషన్ రాక, లేదా మరేతర కారణాల వలన సొమ్మును తల్లితండ్రులు చెల్లించడంలో విఫలం అయితే , ఆ తర్వాత ప్రభుత్వం నుండి విద్యాదీవెన పధకం కింద తదుపరి అమౌంట్ ను డైరెక్ట్ గా కాలేజీ యాజమాన్యాలకు పంపుతామని ప్రభుత్వం తెలియచేసింది. మరి ఇంకా ఎవరిపైన తల్లితండ్రులు ఈ విషయంలో సరైన సమాచారం లేకపోతే త్వరపడాలని సోషల్ మీడియా లు చెబుతున్నాయి.
కాగా వచ్చే ఎన్నికల్లో జగన్ తీసుకువచ్చిన ఈ పథకాలే గెలుపుకు కారణం అవుతాయని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు.