చైనా వక్రబుద్ధి.. అరుణాచల్‌, ఆక్సాయ్‌చిన్ తమవేనంటూ మ్యాప్ విడుదల

-

డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈసారి ఓ అడుగుముందుకేసి సిగ్గువిడిచి ప్రవర్తించింది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆక్సాయ్‌ చిన్​.. తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్‌ మ్యాప్‌ను విడుదల చేసింది.

చైనా న్యాచురల్‌ రిసోర్సేస్‌ రూపొందించిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా డ్రాగన్ దేశం పేర్కొంది. ఇక 1962 వరకు కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్‌ చిన్‌ను డ్రాగన్‌ దేశం ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూ భాగంపై భారత్‌, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.

ఇక తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను కూడా చైనాలో భాగమేనని నూతన మ్యాచ్‌లో పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్‌ డ్యాష్‌ లైన్‌ను కూడా తమ ప్రాంతంగా చూపించుకుంది. దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చైనా తన సరిహద్దు దేశాలతో కోరికోరి శత్రుత్వం కొనితెచ్చుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news