భారతదేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఇవే చివరి ఎన్నికలు అంటూ కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో ఈ సంవత్సరం మొత్తం అయిదు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి పక్షాలు విజయాన్ని సాధిస్తాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఇక ఈ విజయమే రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి తొలి మెట్టు అంటూ నమ్మకంగా చెప్పారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ మరియు మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి, సర్వేల ప్రకారం ఈ అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటూ ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. ఇక 2024 లో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అవనున్నారని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణాలో రానున్న ఎన్నికలలో సీట్ల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలై ఉంది. మరి చూద్దాం ఏమి జరగనుందో ?