తెలంగాణ గవర్నర్ తమిళి సై ఇవాళ విజయవాడలో పర్యటించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దగ్గర ఉండి దర్శనం చేయించడంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఇంద్రకిలాద్రిపై అమ్మవారికి గవర్నర్ తమిళి సై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతంరం వేదపండితులు ఆశీర్వాదంతో పాటు శాలువాతో గవర్నర్ ను సత్కరించారు.
అనంతరం గవర్నర్ తమిళి సై మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని.. ఆదిత్య ఎల్ 1 కూడా విజయవంతం కావాలని ప్రార్థించినట్టు తెలిపారు. గవర్నర్ పర్యటించే ప్రాంతాల్లో కంకరతో రోడ్లపై ఉన్న గుంతలను రాత్రికి రాత్రి పూడ్చారు. మంగళగిరిలో కొంత మంది యువకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కురగల్లు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. అధికారులు ఆగమేఘాల మీద గుంతలను పూడ్చడాన్ని యువకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.