“ఇండియా – నేపాల్” మ్యాచ్ కు వర్షం అడ్డంకి …

-

ఈ రోజు ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు నేపాల్ జట్ల మధ్యన శ్రీలంకలోని పల్లెకెల్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వాస్తవంగా ఇలాంటి జట్లపైన మొదట బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా రోహిత్ నిర్ణయం తీసుకోవడం చాలా మంది అభిమానులను ఇబ్బంది పెట్టింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ జట్టు ప్రస్తుతం 37 .5 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులతో ఉండగా వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. కాగా దీపేంద్ర సింగ్ మరియు సొంపాల్ కమి లు క్రీజులో ఉన్నారు.. ఇక ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు మరియు సిరాజ్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.

బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి వర్షం త్వరగా తగ్గి మ్యాచ్ స్టార్ట్ అవుతుందా ? చూడాలి ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడం చాలా అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news