హైదరాబాద్ లో కుండపోత వర్షం..‘ఈ నంబర్లకు ఫోన్ చేయండి’

-

హైదరాబాద్ లో కుండపోత వర్షం నేపథ్యంలో GHMC అప్రమత్తమైంది. ప్రజలు మరికొన్ని గంటలపాటు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరించింది. ఇబ్బందుల్లో ఉన్న, చెట్టు కూలిపోయిన, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిన వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.

040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. మ్యాప్ లొకేషన్ తో పాటు ఫోటోలను కూడా షేర్ చేయాలని ట్వీట్ చేసింది.  కాగా, హైదరాబాద్ మహా నగరంలో ఉన్న స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. ఈ మేరకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్. భారీ వర్షాల నేపథ్యం లో హైదరాబాద్ జిల్లా స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. అటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news