ఎలా అయితే మనం ఇంటిని శుభ్రం చేస్తామో అలానే టాయిలెట్ సీట్ ని టాయిలెట్ ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. టాయిలెట్ పాట్ ని క్లీన్ చేయడం కష్టమైన పని టాయిలెట్ పాట్ శుభ్రం చేసినప్పుడు ఎక్కువ శ్రమ పెట్టాలి పసుపు రంగులో మురికిగా కనపడుతున్నట్లయితే దాన్ని వదిలించడం కష్టంగా ఉంటుంది. కానీ ఇలా కనుక మీరు చేసినట్లయితే చిటికెలో టాయిలెట్ పాట్ ని కొత్తదానిలా మార్చేసుకోవచ్చు. కాస్టింగ్ సోడా పౌడర్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
ఈ పౌడర్ ద్వారా పసుపు మరకలు త్వరగా పోతాయి పైగా ఈ పౌడర్ తో క్లీన్ చేయడం వలన కొత్త టాయిలెట్ పాట్ లాగ మెరిసిపోతుంది. కాస్టింగ్ సోడా చాలా ప్రభావితమైన పౌడర్. టాయిలెట్ పాట్ ని శుభ్రం చేసేటప్పుడు బాత్రూం క్లీనర్ వైట్ వెనిగర్ ని కూడా తీసుకోండి. టాయిలెట్ ని క్లీన్ చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోండి టాయిలెట్ పాట్ ని శుభ్రం చేయడానికి బాత్రూం క్లీనర్ కాస్టింగ్ సోడా ని మిక్స్ చేసుకోండి.
దీనిని మీరు టాయిలెట్ పాట్ మీద స్ప్రెడ్ చేయండి 15 నిమిషాల వరకు అలా వదిలేయండి ఇప్పుడు బ్రష్ తో రుద్దండి నీటితో కడిగేయండి అంతే క్షణాల్లో టాయిలెట్ పాట్ కొత్తగా వచ్చేస్తుంది బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి పసుపు రంగులో ఉన్న మచ్చలు కూడా మాయమైపోతాయి. ఇలా ఈజీగా మీరు టాయిలెట్ పాట్ ని క్లీన్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడక్కర్లేదు.