సనాతన ధర్మం వివాదం.. సారీ చెప్పేదేలేదన్న ఉధయనిధి స్టాలిన్

-

ఇండియా పేరును భారత్​గా మార్చడం తర్వాత.. ప్రస్తుతం దేశమంతా నడుస్తున్న చర్చ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు. ఆయన సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్షాలు.. బీజేపీ వర్గాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.

ఈ విషయంలో ఉదయనిధి స్టాలిన్​ వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేదేలేదంటూ మరోసారి తెగేసి చెప్పారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను మళ్లీ సమర్థించుకున్నారు. కుల వివక్షపై స్టాలిన్​ను చెన్నైలో విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉదాహరణగా చెప్పారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలైన ముర్మును ఆహ్వానించకపోవడమే ఇందుకు సరైన ఉదాహరణ అని తెలిపారు.

తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని.. కానీ, సనాతన ధర్మంలోని కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. తాను కేవలం హిందూ మతానికి మాత్రమే కాదని.. అన్ని మతాలకు వ్యతిరేకమని అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ చెప్పిన విషయం తెలిసిందే.చారు.

Read more RELATED
Recommended to you

Latest news