తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చ అంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…. హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరం పోతుందని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళమన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానం అంటూ కెసిఆర్ సర్కార్ ను కొనియాడారు చంద్రబాబు నాయుడు.
రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అరాచకాలపై నేను పోరాటం సాగిస్తున్నా. అందుకే నన్ను అరెస్టు చేస్తారోమో అంటూ చంద్రబాబు అన్నారు.45ఏళ్లు నిప్పులా బతికా. నేను ఏ తప్పూ చేయలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్.. సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులకుకూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు
హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరం పోతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానం – చంద్రబాబు నాయుడు pic.twitter.com/2hFZRwJme8
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2023