వాహనాలపై ఉండే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ వెనుక అసలు కథ తెలుసా..?

-

వాహనాలపై చాలా మంది వివిధ రకాల స్టిక్కర్స్‌ వేయించుకుంటారు. కొందరు ఏవేవో సింబల్స్‌, ఫ్యామిలీ వాళ్ల పేర్లు వేయిస్తే.. మరికొందరు దేవుళ్ల ఫొటోలు, గుర్తులు వేయించుకుంటారు. చాలా మంది వాహనాలపై ఆంజేనయుడి స్టిక్కర్స్‌ వేయించుకుంటారు. బలానికి, నమ్మకానికి ప్రతీక హనుమాన్‌. అయితే మీరు చూసే ఉంటారు.. కోపంగా ఉన్న హనుమాన్‌ స్టిక్కర్‌.. చాలా మంది వాహనాలపై ఇది వేయించుకుంటారు. ఈరోజు మనం ఈ చిత్రం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. ఇది అన్ని దేవుళ్ల చిత్రల్లా కాదు. భిన్నం.. ఉగ్రరూపంలో ఉన్న హునుమాన్‌ను మనం ఎక్కడా చూడలేం.. మొదటి సారి ఈ స్టిక్కర్‌లో చూసి చాలా మంది ఇష్టపడి తీసుకున్నారు.

 

ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ను కరణ్‌ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్‌ వేశారు. ఈయన కేరళలోని కాసరగోడ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. హనుమాన్‌ అంటే ఉగ్రరూపంలో ఉంటే బాగుంటుంది అని ఆయన అలా కోపంగా చూస్తున్నట్లు కరణ్‌ బొమ్మ గీశారు. ఈ చిత్రానికి ఆయన ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా స్నేహితుల బృందం కోసం 2015లో దీనిని రూపొందించానని, అరగంట కంటే తక్కువ సమయం పట్టిందని కరణ్ చెప్పాడు. తను గ్రాఫిక్స్ పూర్తి చేసిన తర్వాత దానిని స్నేహితుడికి పంపాడట. రెండు రోజుల తర్వాత, సోషల్ మీడియాలో తన స్నేహితులు కొందరు తమ ప్రొఫైల్‌గా ఉపయోగించారు. కానీ కొన్ని రోజుల తర్వాత తనకు తెలియని వారు కూడా దీని ఉపయోగిస్తున్నారు కిరణ్‌ గమనించారు. అది చాలా పాపులర్ అయిందని అప్పుడే తెలిసిందట.

అయితే ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తామని, హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ కరణ్‌ ఆచార్య అందుకు నిరాకరించారు. ఈ హనుమాన్‌ బొమ్మను రాయల్టీ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజలందరూ ఈ బొమ్మను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అందుకనే చాలా మంది ఈ బొమ్మను వాహనాలపై స్టిక్కర్‌ రూపంలో వేసుకుంటున్నారు. ఇక హనుమాన్‌ అంటే ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు అని మనకు చిన్నప్పటి నుంచి నమ్మకం. రాత్రుళ్లు భయం వేస్తే చాలు.. వెంటనే హనుమాన్‌ను తలుచుకునేవాళ్లం..!

Read more RELATED
Recommended to you

Latest news