షాకింగ్ న్యూస్.. న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారు చేసిన నార్త్ కొరియా

-

నార్త్ కొరియా మరోసారి షాక్ ఇచ్చింది. అయితే ఈసారి ప్రపంచాన్ని భయపెట్టే పని చేసింది. కిమ్‌జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలోని ఉత్తరకొరియా అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా ఏకంగా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌’ను తయారు చేసినట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న కిమ్‌ .. ఓ షిప్‌ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని నార్త్ కొరియన్ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అయితే ఇది కేవలం అణుదాడి చేసేది మాత్రమే కావచ్చని.. ఇది అణుశక్తితో నడిచేది కాకపోవచ్చని అమెరికా నౌకాదళ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్​మెరైన్ ప్రత్యేకతలు ఏంటంటే..

ఇది సోవియట్‌ కాలం నాటి రోమియో శ్రేణి సబ్‌మెరైన్‌ డిజైన్‌ ఆధారంగా రూపొందించిన సబ్​మెరైన్

ఈ కొత్త సబ్‌మెరైన్‌కు ‘హీరో కిమ్‌ గన్‌-ఓకే’ అనే పెట్టారు.

ఈ సబ్‌మెరైన్‌ నుంచి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ను ప్రయోగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news