విద్యార్తులపై దాడి చేసిన పోలీసుల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం అన్నారు. వరంగల్ సీపీ క్షమాపణ చెప్పాలి అన్నారు. విద్యార్థులను దొంగలుగా క్రిమినల్స్ గా చిత్రీకరణ చేస్తున్నారు. కేసులు ఉన్న వీసీని పక్కన పెట్టుకొని మీడియా సమావేశం నిర్వహించడం శోచనీయం అన్నారు రఘునందన్ రావు.
వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. విద్యార్థులను మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అర్థరాత్రి జస్టిస్ ఎదుట ఎందుకు ప్రవేశ పెట్టారు లైవ్ డిటెక్టర్ పరీక్షకు సీపీ సిద్దమా..? సీపీ పై కోర్టు ప్రైవేట్ కంప్లేంట్ చేస్తాం అన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ ను కలుస్తాం అని పేర్కొన్నారు. విద్యార్థుల పై జరిగిన దాడికి వరంగల్ బంద్ కు అందరు సహకరించాలి. వరంగల్ సీపీ రంగనాథ్ తీరు సరిగ్గా లేదన్నారు.పోలీసులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 12న వరంగల్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు రఘునందన్ రావు.