ఏపీ ప్రజలకు శుభవార్త..ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాలు

-

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది జగన్‌ సర్కార్‌. ప్రజల ఆరోగ్య సమస్యల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తోలుత హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలపై సర్వేచేస్తారు.

ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు అందిస్తారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తారు.
అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే గొప్ప వైద్య సంస్థ‌గా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌) ను అభివృద్ధి చేస్తామ‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. స్థానిక విమ్స్ ను శుక్రవారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని సంద‌ర్శించారు. వార్డుల్లో క‌లియ‌తిరుగుతూ రోగుల‌తో ఆప్యాయంగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, మందుల పంపిణీపై ఆరా తీశారు. భోజ‌న స‌దుపాయం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరుపై రోగులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news