ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం !

-

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రకటించిన విశ్వకర్మ పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ఏడాది 2.5 లక్షల మంది చేతి వృత్తిదారులను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ పథకం కింద అర్హులకు రూ. 2.5 లక్షల రుణం ఇస్తారు. అలాగే రూ. 15,000 విలువైన పనిముట్లను రాయితీపై అందిస్తారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి, రూ. 500 చొప్పున స్టైఫండ్ గా ఇస్తారు.

Jagan Sarkar's key decision on Prime Minister's Vishwakarma scheme
Jagan Sarkar’s key decision on Prime Minister’s Vishwakarma scheme

అటు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ నెల 30 నుంచి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది జగన్‌ సర్కార్‌. ప్రజల ఆరోగ్య సమస్యల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తోలుత హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలపై సర్వేచేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news