ఈ సారి సోషియో ఫాంటసీ సినిమా వస్తున్న మెగాస్టార్‌

-

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్టకు ఓకే చెప్పారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. చిరంజీవికి ఇది 157వ చిత్రం. చిత్రబృందం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు వశిష్ట పంచుకున్నారు. మెగా 157 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా మొదలయ్యాయని వెల్లడించారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తెలిపారు. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో భారీ హంగులకు లోటు ఉండదని అర్థమవుతోంది.

Chiranjeevi: చిరు 157 షురూ.. వశిష్ఠ ట్వీట్‌.. | director vassishta shares  latest update on chiranjeevi 157 project

సోషియో ఫాంటసీ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తప్పకుండా ఉంటుంది. చిరంజీవి కెరీర్ మొత్తంలో టాప్ 10 ఫిలిమ్స్ తీస్తే… ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. దాని తర్వాత ‘అంజి’ అని మరో సోషియో ఫాంటసీ సినిమా చేశారు మెగాస్టార్. కొంత విరామం తర్వాత మళ్ళీ ఆ జానర్ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ కూడా సోషియో ఫాంటసీ చిత్రమే. అందువల్ల, ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news