న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ 369

-

ఈ రోజు ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన జరుగుతున్న మూడవ వన్ డే లో ఇంగ్లీష్ జట్టు పట్టు బిగించింది.. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ మరో 2 ఓవర్లు మిగిలి వుండగానే 368 పరుగులు చేసి భారీ టార్గెట్ ను ఉంచింది. మొదట ఆరంభం లోనే రెండు కీలక వికెట్లు తీసి బౌల్ట్ న్యూజిలాండ్ కు గుడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మలన్ మరియు స్టోక్స్ లు మూడవ వికెట్ కు అభేద్యంగా 199 పరుగులు జోడించారు. మలన్ 96 పరుగుల వద్ద ఔట్ అయ్యి మిస్ చేసుకోగా, స్టొక్స్ మాత్రం 124 బంతుల్లో 182 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు మంచి స్కోర్ ను అందించాడు. ఒక న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 5 మరియు లిస్టర్ 3 వికెట్లు తీసుకున్నాడు. కాగా న్యూజిలాండ్ ముందు ఉంచిన ఈ భారీ స్కోరు ను చేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చెయ్యాలి.

కాగా ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కు ఓపెనర్లు సరైన స్టార్టింగ్ ను అందిస్తే మ్యాచ్ గెలవడం కష్టం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news