ఆసియా కప్; 49 సంవత్సరాల వన్ డే క్రికెట్ చరిత్రలో ఇండియా చెత్త రికార్డ్… !

-

శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో నిన్న శ్రీలంక మరియు ఇండియా జట్ల ఆమధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలో 41 పరుగుల తేడాతో విజయం సాధించినా, చివరికి ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇండియా ఇప్పటి వరకు క్రికెట్ లోకి ప్రవేశించి 49 సంవత్సరాలు పూర్తి అయింది . కానీ ఇప్పటి వరకు అటువంటి ఒక రికార్డును కాపాడుకుంటూ వస్తోంది. అయితే అది కాస్త నిన్నటికి చెరిగిపోయింది, నిన్న ఇండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 213 పరుగులకే కుప్పకూలిపోయింది. నిజంగా ఇండియా బ్యాటింగ్ లో ఇంత వరెస్ట్ గా ఆడుతుందా అన్నట్లు ప్రదర్శన చేసింది. అయితే అన్ని వికెట్లను స్పిన్నర్ లకే కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పాలి.

India vs Sri Lanka, Super Fours, 4th Match

ఆసియా కప్; 49 సంవత్సరాల వన్ డే క్రికెట్ చరిత్రలో ఇండియా చెత్త రికార్డ్… !మాములుగా అయితే ఇండియా కు స్పిన్ బాగా ఆడుతుంది అన్న పేరుంది. కానీ నిన్నటితో అది కూడా మంట కల్సిపోయింది. శ్రీలంక స్పిన్నర్ లలో దునిత్ 5, అసలంక 4 మరియు తీక్షణ 1 వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news