పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు నసీం షా దూరం !

-

ఇండియా పాకిస్తాన్ ఆసియ కప్ మ్యాచ్ లో భాగంగా ఫాస్ట్ బౌలర్లు నసీం షా మరియు హరీష్ రాఫ్ గాయాల కారణంగా ఆసియా కప్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరం అయ్యారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ నుండి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నసీం షా గాయాన్ని పరీక్షించగా తీవ్రత ఎక్కువ గా ఉందని… అక్టోబర్ లో ఇండియా వేదికగా జరగనున్న వన్ డే వరల్డ్ కప్ లోని కొన్ని మ్యాచ్ లకు సైతం నసీం షా దూరంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలిపింది. ఈ వార్తతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పాకిస్తాన్ లో ఆఫ్రిది, నసీం షా, హరీష్ రాఫ్ లతో కూడిన స్పీడ్ బౌలింగ్ ఏ జట్టును అయినా వణికించగలదు. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు నసీం షా దూరం కావడం షాక్. ఇక బ్యాటింగ్ లోనూ ఏమంత ప్రభావవంతంగా పాకిస్తాన్ కనిపించడం లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యాజమాన్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనుంది అన్నది చూడాలి. ఇక ఆసియ కప్ లో నిన్న శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news