టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవెలప్ మెంట్ కేసులో నిధుల అవినీతి జరిగిందన్న కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతుల నడుమ రిమాండ్ లో ఉన్నారు. ఈ రిమాండ్ గడువు సెప్టెంబర్ 22వ తేదీతో ముగియనుంది. కాగా ఈయనను ఎలాగైనా బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తరపున లాయర్లు ఒకవైపు మరోయు కొడుకు నారా లోకేష్ మరోవైపు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిన్న ఉదయం బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వరి మరియు పవన్ కళ్యాణ్ లు రాజమండ్రి జైలులో చంద్రబాబును కలుసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు మరోసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆయనను కలవడానికి రాజమండ్రి జైలుకు వెళ్లగా అక్కడ అధికారులు ఈమె పెట్టుకున్న ములాఖత్ దరఖాస్తును తిరస్కరించారు.
ఈ విషయంపై భువనేశ్వరి స్పందించారు… వారానికి మూడు సార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా తిరస్కరించారని బాధపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఎంతో అన్యాయంగా ప్రవర్తిస్తోందంటూ ఆవేదనను తెలియచేశారు భువనేశ్వరి.