ఒకేదేశం-ఒకే ఎన్నికలు తొలి సమావేశంపై క్లారిటీ ఇచ్చిన మాజీ రాష్ట్రపతి

-

దేశంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశంపై క్లారిటీ వచ్చింది. ఈ సమావేశం సెప్టెంబర్ 23న జరుగుతుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం మీడియాకు వెల్లడడించారు.

‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’పై కమిటీ తొలి అధికారిక సమావేశం సెప్టెంబర్ 23న జరగనుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news