కృష్ణ ట్రిబ్యునల్ కి లేఖ రాసేందుకు బీజేపీ నాయకులకు పదేళ్ల సమయం సరిపోలేదా? : కేసీఆర్

-

పాలమూరు ప్రాజెక్టును గత పాలకులు, నాయకులు చాలా మంది అడ్డుకున్నారని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ నార్లపూర్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్ లు మూడు పూర్తి అయితే తెలంగాణ దేశానికే అన్నం పెడుతుందన్నారు కేసీఆర్. తెలంగాణలో మనకు రావాల్సిన నీటి వాటాలను లెక్కగట్టి మూడు ప్రాజెక్టుల పనులను ప్రారంభించామని తెలిపారు.

పాలమూరు ప్రాజెక్ట్ ను ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇన్నాళ్లు అడ్డుకున్నారు.. బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి లాంటి నేతలు పాలమూరుపై విమర్శలు చేశారు. పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు. పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. కృష్ణాలో నీటి వాటాలు తేల్చలేదు. పాలమూరుకు నీళ్లు అడిగితే కేంద్రం ఏం చేసింది? అని ప్రశ్నించారు. బీజేపీకి పౌరుషం ఉంటే కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి వాటాలు తేల్చాలి అన్నారు. మాజీ సీఎంలు దత్తత తీసుకున్నా పాలమూరుకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ నీటి వాటా తేల్చాలంటే ప్రధాని మోడీ స్పందించలేదు.. కృష్టా ట్రిబ్యునల్‌కు లేఖ రాసేందుకు పదేళ్ల సమయం సరిపోలేదా?.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేటాయించండి.. బీజేపీ జెండాలు పట్టుకుని ఎవరైనా వస్తే ప్రజలు నిలదీయాలి అని ప్రజలకు సూచించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news