వినాయక చవితి 2023 : వినాయకుడికి ఇష్టమైన మోదకాలు.. తింటే ఎన్నో లాభాలు తెలుసా..?

-

వినాయక చవితి అంటే.. కేవలం పూజ మీద మాత్రమే కాదు..మన ఫోకస్‌ నైవైద్యం మీద కూడా ఉంటుంది కదా..! అమ్మ ఏం వెరైటీస్‌ చేస్తుందా అని చూస్తుంటాం. ఈరోజు చాలా మంది చేసే నైవేద్యాల్లో మోదకాలు కామన్‌గా ఉంటాయి. వినాయకుడి ఇది చాలా ఫేవరట్‌ ఫుడ్ ఐటమ్. ఇది కేవలం టేస్టీగానే కాదండోయ్‌ హెల్తీ కూడా. మోదకాలు వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు ఈరోజు కచ్చితంగా తెలుసుకోవాలి.

గణేశ చతుర్థి నాడు గౌరీ కుమారుడికి మోదకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకంటే వినాయకుడికి మోదకాలంటే చాలా ఇష్టం. ప్రతి గణపతి పూజలో మోదక నైవేద్యాన్ని సమర్పిస్తారు. మోదకం బియ్యం, కొబ్బరి, బెల్లం నుండి తయారు చేస్తారు. అది ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ రుచికరమైన చిరుతిండిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

మోదకం తయారీలో నెయ్యిని ఉపయోగిస్తారు. నెయ్యి మలబద్ధకం నుండి ఉపశమనానికి, శరీరం నుంచి టాక్సిన్ బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నిజానికి నెయ్యి ప్రేగులలోని శ్లేష్మ పొరను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నెయ్యిలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. దంత క్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే, నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ కీళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

మోదకంలో నింపడానికి తురిమిన కొబ్బరిని తయారు చేస్తారు. కొబ్బరికాయల్లో ట్రై-గ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.కొబ్బరిలో ఉండే మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.

మోదకంలో కూడా డ్రై ఫ్రూట్స్ వాడతారు. నట్స్‌లో మొక్కల స్టెరాల్స్ ఉంటాయి. ఇవి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మోదకం యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది తీసుకోవడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.

సాంప్రదాయకంగా మోదకాన్ని బెల్లం నుంచి తయారు చేస్తారు. మోదక గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులకి కూడా మంచి మూలం. అంతే కాదు బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలేయం, ప్రేగులు కడుపుని శుభ్రపరచడం ద్వారా శరీరం నుండి టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది.

ఇన్ని లాభాలున్న మోదకం కచ్చితంగా తినాల్సిందే కదా.. ఇంకెందుకు ఆలస్యం ఈ వినాయకచవితికి ఓ పట్టు పట్టేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news