కాంగ్రెస్‌ లాంటి ఊసరవెల్లిని నమ్మితే…3 గంటల కరెంటే గతే – KTR

-

కాంగ్రెస్‌ పార్టీ నిన్న ప్రకటించిన ఎన్నికలక హామీలకు కౌంటర్‌ వేశారు మంత్రి కేటీఆర్‌. మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..! ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..! రాబందుల రాజ్యమొస్తే… రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. కాలకేయుల కాలం వస్తే..కరెంట్‌ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు.

మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే… మూడు గంటల కరెంటే గతి..ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అంటూ కాంగ్రెస్‌ పార్టీకి చురకలు అంటించారు. దగాకోరుల పాలనొస్తే… ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ అన్నారు. బకాసురులు గద్దెనెక్కితే… రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే…సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ అన్నారు కేటీఆర్. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే.. ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అని విమర్శలు చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news