ఇండియా లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 మధ్యన వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇండియాలోని పది వేదికలో మ్యాచ్ లు జరపడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇక ఇప్పటి వరకు వన్ డే వరల్డ్ కప్ చరిత్రలో కేవలం రెండు సార్లు మాత్రమే సాధించింది. ఒక వరల్డ్ కప్ ను కపిల్ దేవ్ సాధించగా, మరో వరల్డ్ కప్ ను ధోని సాధించి పెట్టాడు. ఇక తాజాగా ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ వరల్డ్ కప్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండియా టీం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని , ఖచ్చితంగా 100 శాతం కప్ ను గెలవగలిగే సత్తా ఉందని కపిల్ దేవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కపిల్ దేవ్. ముందుగా మన టార్గెట్ టాప్ 4 కు చేరుకోవడమే అని ఒక గోల్ ను ఇండియాకు తెలియచేశాడు.
ఇక వరల్డ్ కప్ కు ముందు శ్రేయాస్ అయ్యర్ మరియు అక్షర్ పటేల్ లాంటి ఆటగాళ్లు పూర్తిగా ఫిట్నెస్ ను సాధించకపోవడం చాలా బాధాకరం అన్నారు కపిల్ దేవ్.