నాగ చైతన్య రెండో పెళ్లిపై క్లారిటీ.. సామ్ కు షాక్ !

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ జంటలలో చూడముచ్చటగా జీవిస్తూ ఉన్నదీ నాగ చైతన్య మరియు సమంతలు. కానీ ఈ జంటపై దేవుడు కన్నెర్ర చేశాడు..ఫలితంగా కారణాలు ఏవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వీరిద్దరూ పరస్పర అవగాహనతో విడిపోయారు. ఇప్పుడు వేరు వేరుగా ఉంటూ కెరీర్ లో బిజీ గా ఉన్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య రెండవ పెళ్లి గురించి ఒక కీలక విషయం తెలుస్తోంది. ఇంతకు ముందు వరకు నాగ చైతన్య ఒక ప్రముఖ వ్యాపారవేత్త అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఇండియా టుడే ఒక ఆర్టికల్ ద్వారా బట్టబయలు చేసింది. అంతే కాకుండా ఇండియా టుడే తెలిపిన మేరకు నాగ్ చైతన్య నటి శోభిత ధూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడని వీరిద్దరి మధ్యన బంధం రోజురోజుకు బలపడుతోందని… త్వరలోనే అందరికీ శుభవార్త అందించనున్నారని తెలిపింది.

ఈ వార్తతో నాగ్ మరియు శోభిత ల పెళ్లి త్వరలోనే జరగనుంది అని అందరూ అనుకుంటున్నారు. ఈ వార్త సామ్ కు గట్టి షాక్ అని చెప్పాలి..