ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఒక పద్దతి ప్రకారం 5 రోజుల పాటుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభలో పార్లమెంటు ప్రస్థానం పై చర్చ జరిగింది, ఈ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈయన మాట్లాడుతూ ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచింది… ఈ సమయంలో 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చారు. వీరు సుదీర్ఘ కాలం పాలించినా దేశంలో అభివృద్ధి జరిగిన ఘటనలు చాలా తక్కువ అన్న అర్దం లో మాట్లాడారు విజయసాయి రెడ్డి. కాంగ్రెస్ కాకుండా మరో ఏదైనా పార్టీ ఇంతకాలం ఇండియాను పాలించి ఉంటే దేశం అభివృధ్ది జరిగి ఉండేది అంటూ అభిప్రాయపడ్డారు విజయసాయి రెడ్డి.
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చే సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును కూడా విజయసాయి రెడ్డి ఎండగట్టారు… పార్లమెంట్ లో ఈ బిల్లును పాస్ చేసే సమయంలో తలుపులు మూసేసి, లైవ్ టెలి కాస్ట్ కట్ చేసి బిల్ ను పాస్ చేయడం కాకుండా… ఏపీ ఎంపీ లను సస్పెండ్ చేశారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.