గుడ్ న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

కొన్నిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 07-11-2019 గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల ధర 39,900 రూపాయలకు దిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయలు తగ్గింది. దీంతో 36,580 రూపాయలైంది. ఇక వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి 48,500 రూపాయలకు దిగింది.

అలాగే, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 400 రూపాయలు తగ్గి 38,550 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 400 రూపాయలు తగ్గి 37,350 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 200 రూపాయలు తగ్గింది. దీంతో 48,500 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news