ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు – నిమ్మల

-

అమరావతి: వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు టిడిఎల్పి ఉపనేత నిమ్మల రామానాయుడు. అసెంబ్లీని లోటస్ పాండ్ నివాసంలా.. వైసీపీ కార్యాలయంలా మార్చారని విమర్శించారు. ప్రజాగళం వినిబడనీయకుండా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొంటూనే అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే అంశాన్ని అసెంబ్లీలో గళమెత్తుతామన్నారు నిమ్మల రామానాయుడు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యాక్రమాలపై చంద్రబాబు చేపడుతోన్న కార్యక్రమాలకు స్పందన రావడంతోనే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని అసెంబ్లీ వేదికగా మా వాదన వినిపిస్తామన్నారు. చంద్రబాబును జైల్లో వేస్తే.. ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు కేసులను ఎత్తేయాలనే ప్రధాన డిమాండుతో అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news