చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశంపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని అభిప్రాయపడుతోంది టీడీఎల్పీ. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దాం, వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామంటున్నారు నేతలు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకుంది.
మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది టీడీఎల్పీ. వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశమిస్తే జగన్ అక్రమాస్తుల కేసులపై స్క్రీన్ ప్రెజెంటేషనుకు పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. సభ లోపల అవకాశం ఇవ్వకుంటే.. జగన్ అవినీతి కేసుల అంశాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నాయన్న అంశం పైనా టీడీఎల్పీలో చర్చ జరుగుతోంది. సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు అసెంబ్లీ లోపల, బయటా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలనుకుంటున్నారు టీడీపీ నేతలు.