టిడిపి-జనసేన పొత్తు వలన కలిగే లాభనష్టాల గురించి పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతో ఉన్నారు. పార్టీ స్థాపించి పది సంవత్సరాలుగా నడిపిస్తున్న వ్యక్తికి పొత్తు విషయంలో పూర్తిగా అవగాహన ఉంటుందని ఎవరు ఎటువంటి అయోమయానికి లోను కావద్దని పవన్ కార్యకర్తలకు సూచించారు.
జనసేనకు 45 నియోజకవర్గాలలో గట్టి ఓటు బ్యాంక్ ఉంది . పవన్ కళ్యాణ్ ఇతర కార్యక్రమాలలో కొంచెం బిజీగా ఉండడం వలన రాజకీయాలపై నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు. జనసేనకు ఓట్లు ఉన్నాయి.. లీడర్లు ఉన్నారు. కానీ వాటిని తమకు అనుకూలంగా.. అనుకూలమైన ఓట్లుగా మార్చుకోవడానికి కావలసిన బూత్ లెవెల్ కార్యకర్తలు లేరని చెప్పవచ్చు. ఇప్పుడు పవన్ ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే , జనసేన కోరుకున్న 45 స్థానాలలో కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనసేన-టిడిపి పొత్తులో జనసేన 45 నియోజకవర్గాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అవి అన్ని గతంలో వైసిపి గెలుచుకున్నవి ఇప్పుడు ఆ 45 సీట్లలో వైసీపీకి ఓటమి తప్పదు. గతంలో 151 స్థానాలు గెలిచిన వైసిపి ఈ 45 స్థానాలు ఈసారి కోల్పోయినట్లే అని జనసేన నేతలు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా ఇలా కొన్ని జిల్లాలలో జనసేనకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో జనసేన కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.
అయితే జనసేన ఖచ్చితంగా గెలవాలంటే టిడిపి మద్దతు తప్పనిసరి. టిడిపి ఓటర్లు ఓటు వేస్తేనే ఆయా స్థానాల్లో జనసేన గెలవగలదు. లేదంటే రిస్క్ తప్పదు. చివరికి వైసీపీ సక్సెస్ అవుతుంది. చూడాలి పవన్ వ్యూహాన్ని తిప్పి కొట్టగల శక్తి వైసిపికి ఉందా? లేదా? అనేది.