ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు ఉత్తమ గౌరవంగా “ఆస్కార్” అవార్డు ను భావిస్తారు. అమెరికా కేంద్రంగా ఇచ్చే ఈ ఆస్కార్ అవార్డు ఒక్కసారి వస్తే వారి లైఫ్ మారిపోతుంది. అంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఆస్కార్ అవార్డు. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్కార్ కు చాలా సినిమాలు ఇండియా నుండి అప్లికేషన్ పెట్టుకున్నాయి. ఆ చిత్రాలలో బలగం, దసరా, ది కేరళ స్టోరీ, గద్దర్ 2, విడుదలై 1, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ లాంటి కొన్ని చిత్రాలు ఆస్కార్ బరిలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ వీటిలో ఎన్ని సినిమాలు ఆస్కార్ ను మెప్పించి నామినేషన్ కు అర్హత సాధిస్తాయి అన్నది తెలియాల్సి ఉండగా, తెలుగు నుండి శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మరియు కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన అచ్చం తెలంగాణ యాసతో తెరకెక్కిన బలగం దరఖాస్తు చేసుకున్నాయి.
మరి ఈ రెండూ నామినేషన్స్ కు అర్హత సాధిస్తాయా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.