భారత్‌తో బంధం బలోపేతమవ్వాలి.. చైనా నుంచి వాణిజ్య స్వాతంత్య్రం పొందాలి : వివేక్ రామస్వామి

-

అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున దూసుకెళ్తున్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తాను అధికారంలోకి వస్తే అమెరికాలో ఎటువంటి పాలసీలు తీసుకువస్తారో.. ఏ విధంగా యూఎస్​ను అభివృద్ధి చేస్తారో ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో సంబంధాలపై వివేక్ చాలా స్పష్టతతో ఉన్నట్లు ఆయన ప్రసంగాలు చూస్తే తెలుస్తోందని పలువురు నిపుణులు, రాజకీయవేత్తలు అంటున్నారు.

ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలతో సంబంధాలను పెంపొందించుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు వివేక్‌ రామస్వామి అన్నారు. మరోవైపు చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్య్రం పొందాలంటే భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్‌ చెప్పినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు ఆ కథనంలో తెలిపింది. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ కోసం ఉపయోగించే లిథియం వంటి ఖనిజాల దిగుమతి కోసం చైనాకు బదులుగా భారత్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలను ఆశ్రయించాలని సూచించారు. చిప్స్‌ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని రామస్వామి అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news