బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అంటూ టీడీపీ పార్టీ నేత నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అని.. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూన్నాడని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని…వెల్లడించారు.
జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారని వెల్లడించారు నారా లోకేష్. ఇక అటు టిడిపి అధినేత చంద్రబాబు గారిని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టిడిపి ఎంపీలను అభినందించానని ట్వీట్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంటులో చర్చకి తెచ్చి, దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గట్టి పోరాటం చేశారని వెల్లడించారు నారా లోకేష్. వైకాపా ఎంపీల హేళనలు, మాటల దాడులని తట్టుకుని సమర్థవంతంగా తెలుగుదేశం వాణిని ఎంపీలు పార్లమెంటులో వినిపించారు. భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు.