Chandrababu naidu : రాజమండ్రి జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేసులో భాగంగా సుప్రీంకోర్టు.. మెట్లు ఎక్కనున్నారు నారా చంద్రబాబు నాయుడు. క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు చంద్రబాబు సీఐడీ కస్టర్డ్ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్న సీఐడీ అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో 12 మంది సభ్యుల సీఐడీ బృందం ఆయన్ను విచారిస్తోంది. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు.