దీప్తి సునైనా నుంచి ప్రియాంక వరకూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో హెయిక్‌ కట్‌ చేసుకుంది వీరే.!

-

బిగ్‌ బాస్‌ షో ప్రత్యేకంగా ఒక వర్గం వారికి వ్యసనం అయిపోయింది. కొంతమంది ఈ షోను అస్సలు పట్టించుకోరు. కానీ ఇంకొంతమంది అయితే.. ఆ సీజన్‌ ఎంత చెత్తగా ఉన్నాసరే.. ఎండకార్డు పడే వరకూ డైలీ చూస్తూనే ఉంటారు. బాగా ఎడిక్ట్‌ అయిపోతారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ నడుస్తుంది. ఈ సీజన్‌ మొదటి వారం పెద్దగా ఏం లేకపోయినా.. ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది.

ఇప్పటికే ఇద్దరు ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం ఇంకో సభ్యులు ఎలిమేనేట్‌ కానున్నారు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో మూడో పవర్ అస్త్రా గురించి టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్ ప్రియాంక జైన్ తన హెయిర్ కట్ చేయించుకుంది. అమర్ దీప్ తనకు ఇష్టం లేదని టాస్క్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో ప్రియాంక హేయిర్ కట్ చేయించుకుని.. పవర్ అస్త్రా టాస్క్‌లో మూడో కంటెండర్‌గా నిలిచింది. అయితే ప్రతి సీజన్‌లో ఏదో ఒక టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో ఎవరో ఒకరు హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకూ బిగ్‌బాస్‌ హౌస్‌లో హెయిర్‌ కట్‌ చేసుకున్న ముద్దుగుమ్మలు ఎవరంటే..

బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో దీప్తి సునైనా.. హేయిర్ కట్ చేయించుకున్నారు. మూడో సీజన్‌లో యాంకర్ సావిత్రి హేయిర్ కట్ చేయించుకున్నారు. నాలుగో సీజన్‌లో అలేఖ్య హారిక, ఆరో సీజన్‌లో వాసంతి హెయిర్ కట్ చేయించుకున్నారు. ఇక లేటెస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు 7లో నటి ప్రియాంక జైన్ కూడా హెయిర్ కట్ చేయించుకున్నారు. చూడబోతే ఇదేదో ఆనవాయితీగా వస్తుంది కదా..!

ప్రస్తుతం మూడో ఇంటి సభ్యుడి కోసం టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌లో యావర్ (Prince Yawar), శోభా శెట్టి (Shobha Shetty), ప్రియాంక (Priyanka Jain) కంటెండర్స్‌గా నిలిచారు. ఇక లేటెస్ట్‌ టాస్క్‌లో కంటెండర్స్‌గా ఉన్న ముగ్గురుని నిలబెట్టి, మూడో పవర్ అస్త్రకు ఎవరు అర్హులు కారో వారి బొమ్మను సుత్తితో కొట్టాలి అని బిగ్‌బాస్‌ చెప్తారు.. శోభా, యావర్ బొమ్మను పగల గొట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ప్రియాంక కూడా యావర్ బొమ్మను పగల కొట్టాలనుకుంటుంది. యావర్ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాడు కాబట్టి అతడి బొమ్మని పగల గొట్టాలనుకుంటున్నట్లు చెబుతుంది ప్రియాంక.

Read more RELATED
Recommended to you

Latest news