పోలీస్ కస్టడీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని, విచారణను తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని పేర్కొన్న ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి గారికి రఘురామకృష్ణ రాజు గారుప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు కస్టడీలో తమ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అని న్యాయమూర్తి గారు భావించి ఉంటారని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు.
పోలీస్ కస్టడీలో చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి 9 మంది అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారని, ఏ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే ప్రశ్నిస్తారని, మరి తొమ్మిది మంది అధికారులు ఎందుకు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నవరత్నాలు కలిసి వచ్చినట్లు 9 సంఖ్యతో విచారణకు కూడా నవగ్రహాలను ప్రవేశపెట్టారా అంటూ అపహాస్యం చేశారు. సీబీఐ కోర్టుకు 77 సార్లు రాని నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిందని, ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాలని ఆదేశించిందని, ఈ కేసుకు సంబంధించిన వివరాలను గతంలో ఫైల్ చేశాను… కానీ అప్పట్లో ఫైల్ వెనక్కి ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి గారి దశమ బెయిల్ వార్షికోత్సవం జరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం కోసం పోరాడుతానని, అది తన లక్షణం అని, న్యాయన్ జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.