వచ్చే వారం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్టు, తదనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపిన నారా లోకేశ్… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా…..చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని అభిప్రాయపడ్డారు.
ఇక లోకేశ్ యువగళం పున: ప్రారంభంపైన ముఖ్యనేతలతో నారా లోకేశ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో నారా లోకేశ్ ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం ప్రారంభించనున్న లోకేశ్…చంద్రబాబు పై అక్రమ కేసు విషయంలో ఢిల్లీ లో ఉండి న్యాయ వాదులతో నిత్యం సంప్రదిస్తున్నారట. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ..ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయం తీసుకున్నారట నారా లోకేష్. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింత గా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.