సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 32% బోనస్..!

-

సింగరేణి కార్మికులకు  యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ వేజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ కావడంతో కార్మికుల కళ్లలో ఆనందం ఆకాశాన్ని అంటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల వాటాలో 32 శాతం ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెటివ్స్  ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఉద్యోగులకు రూ.700 కోట్లు ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది. 

తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయడంతో సింగరేణి కార్మికుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను, సీఎంపీఎఫ్ లో జమ చేయాల్సిన మొత్తం మినహా మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. అంతేకాదు.. త్వరలో దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ ను చెల్లించడానికి సిద్ధంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.700 కోట్ల లాభాలబోనస్ దసరా లోపు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని బలరాం ప్రకటించారు. దీపావళి బోనస్ పీఎల్ ఆర్ ముందుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని.. బకాయిలు, బోనస్ చెల్లింపులపై కొందరూ అనవసర అపోహలు సృష్టిస్తున్నారని.. వాటిని కార్మికులు నమ్మొద్దని కోరారు. 

Read more RELATED
Recommended to you

Latest news