WORLD CUP 2023: హైదరాబాద్ లో ఆగిన వర్షం… కాసేపట్లో మొదలు కానున్న మ్యాచ్ !

-

ఈ రోజుటి నుండి వరల్డ్ కప్ కు సంబంధించి వార్మ్ అప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి టీం కూడా రెండు వార్మ్ అప్ మ్యాచ్ లను ఆడదానికి షెడ్యూల్ చేయబడింది. అందులో భాగంగా ఈ రోజు మొత్తం ఆరు జట్లు మూడు మ్యాచ్ లు ఆడుతున్నాయి.. మొదటగా పాకిస్తాన్ న్యూజిలాండ్ ల మధ్యన హైద్రాబాద్ లో జరుగుతుండగా… పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 18 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బాబర్ అజాం మరియు కీపర్ రిజ్వాన్ లు ఉన్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు హైద్రాబాద్ లో వర్షం ఆగిపోయింది. గ్రౌండ్ మీద ఉంచిన కవర్స్ కూడా గ్రౌండ్ స్టాఫ్ తొలగించారు.. మరికాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి వర్షం తర్వాత పాకిస్తాన్ జోరు పెంచుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ గెలవడం అన్నది ముఖ్యం. ఇక న్యూజిలాండ్ టైట్ బౌలింగ్ తో పాకిస్తాన్ ను ఇబ్బంది పెడుతోంది. ఈ వార్మ్ అప్ మ్యాచ్ లో విజయం ఎవరిని వరించనుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news