కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి మంత్రి కేటీఆర్ స‌వాల్.. డిపాజిట్ ఎవరికీ రాదో తేల్చుకుందాం.. రా..!

-

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సూర్యాపేట‌లో ఎవ‌రికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం రా.. అని కోమ‌టిరెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఎన్ని ఎత్తులు, కుట్ర‌లు చేసినా.. జ‌గ‌దీశ్ రెడ్డి విజ‌యాన్ని ఆప‌లేరు.. ఆయ‌న విజ‌యం ప‌క్కా ఖ‌రారై పోయింది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లో యుద్ధం నేరుగా చేయాలి. చేసింది చెప్పాలి.

దాదాపు 55 ఏండ్ల అధికారంలో ఉన్నామ‌ని కాంగ్రెస్, ప‌దేండ్లు అధికారంలో ఉన్నామ‌ని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. అన్ని ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారో వారు చెప్పాలి. అదేవిధంగా మేము కూడా చెప్పాలని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట‌లో మెడిక‌ల్ కాలేజీ ప్రారంభ‌మైంది.. పీజీ సీట్లు కూడా వ‌చ్చాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్ ప్రారంభ‌మైంది. క‌ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సూర్యాపేట‌ జిల్లా అయింది. న‌ల్ల‌గొండ పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. క‌డుపు నిండా సంక్షేమం, కంటి ముందు అభివృద్ధి ఉంది. కాబ‌ట్టి జ‌గ‌దీశ్ రెడ్డిని ఆశీర్వ‌దించి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news