వాళ్ల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన అవినీతి బయట పెట్టు.. భువనేశ్వరికి లక్ష్మీపార్వతి సవాల్‌

-

జైల్లో వున్న భర్త చంద్రబాబు నాయుడు కోసం నారా భువనేశ్వరి కొవ్వొత్తుల ర్యాలీలు, నిరాహార దీక్షలతో ఆందోళన చేస్తున్నారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షకు దిగిన భువనేశ్వరి అక్టోబర్ 5 నుండి ‘మేలుకో తెలుగోడా’ పేరిట బస్సు యాత్రకు సిద్దమయ్యారు. ఇలా భర్త కోసం పోరాటానికి సిద్దమైన భువనేశ్వరికి వైసిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Chandrababu Naidu will meet same fate as NTR at 74: Lakshmi Parvathi

తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు. నువ్వు, నీ అక్క దోపిడీ వర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ము కాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడో ఎన్టీఆర్ చెప్పిన వీడియోను లక్ష్మీపార్వతి ప్రదర్శించారు. ఎన్టీఆర్ కడుపున పుడితే నీ భర్త తప్పు చేశాడు శిక్ష పడాల్సిందేనని ఒప్పుకో అంటూ వ్యాఖ్యానించారు. ధైర్యం ఉంటే హెరిటేజ్ లెక్కలన్నీ బయట పెట్టాలన్నారు లక్ష్మీపార్వతి. ఏ శాపమో మీలాంటి పిల్లలు ఎన్టీఆర్‌కు పుట్టారంటూ.. పవిత్రమైన దేవాలయాల్లో నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలని నీ తండ్రి మరణించాలని క్షుద్రపూజలు చేశావ్ అంటూ ఆమె అన్నారు. జనాన్ని లూఠీ చేసిన ఆయనకు మద్దతుగా బస్సుయాత్ర చేస్తున్నావా అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news