స్వర్ణదేవాలయంలో సామాన్యుడిలా రాహుల్‌.. భక్తులు తిన్న గిన్నెలు శుభ్రం చేస్తూ..

-

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారంనాడు స్వర్ణదేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.స్వర్ణ దేవాలయంలో సేవా కార్యక్రమంలో కూడ ఆయన పాల్గొన్నారు. భక్తులు అల్పాహరం తిన్న గిన్నెలను రాహుల్ గాంధీ శుభ్రపర్చారు. రాహుల్ గాంధీ ఇవాళ రాత్రికి అమృత్‌సర్‌లోనే ఉంటారు. రాహుల్ గాంధీ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా అమృత్ సర్ కు చేరుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఆథ్యాత్మిక పర్యటనకు ఇబ్బంది కల్గించవద్దని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలను కోరారు.

Congress Leader Rahul Gandhi Washes Dishes at Golden Temple in Punjab

అమృత్‌సర్‌ పర్యటన కోసం రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లారు. ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్టుపై కాంగ్రెస్, ఆప్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అమృత్ సర్ పర్యటన ప్రాధాన్యత చోటు చేసుకుంది. సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను గత వారంలో పంజాబ్ పోలీసులు డ్రగ్స్, స్మగ్లింగ్, మనీలాండరింగ్ లో తన పాత్ర ఉందనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. గత జనవరిలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి దర్బార్ సాహిబ్ ను సందర్శించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news