అక్టోబర్ 5వ తేదీ నుండి ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఎంతో అట్టహాసంగా మరియు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. ఈ వరల్డ్ కప్ టైటిల్ ను ఎలాగైనా గెలుచుకోవాలని మొత్తం 10 దేశాలు ఎన్నో ప్రణాళికలను రచించుకుని సమరానికి సిద్ధం అవుతున్నాయి. అక్టోబర్ వ తేదీ మొదటి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ కు ముహూర్తం ఖరారు అయింది. ఇక తాజాగా క్రికెట్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సరి వరల్డ్ కప్ ఎటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు లేకుండానే మొదలు కాబోతోందని అనుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం గుజరాత్ లోనే నరేంద్ర మోదీ స్టేడియం లో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించాలని అనుకున్న బీసీసీఐ ఆ తర్వాత తమ ప్లాన్ మార్చుకుని ఇప్పుడు టోర్నీ అంతా ముగిసిన తర్వాత లేదా ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ ముందు ప్రారంభ వేడుకలు జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారట.
మరి ఏమి జరగనుంది అన్నది తెలియాలంటే టోర్నీ ప్రారంభం అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.