పెళ్లి చేయడం లేదని.. అలిగి.. ఏం చేశాడంటే..?

-

పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లకు పెళ్లి ఓ పెద్ద సమస్యగా ఉంటుంది. అన్నీ ఉన్న అబ్బాయిలైతే ఓకే కానీ.. ఎక్కడా ఆర్థికంగా స్థిరత్వం లభించకపోతే.. ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకురారు. తల్లిదండ్రులు కూడా కెరీర్ లో సెటిల్ కాకపోతే.. పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపించరు. హైదరాబాద్ మల్కాజ్ గిరిలో ఇలాగే తనకు 28 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయడం లేదని ఓ కుర్రాడు ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. అడ్డగుట్టకు చెందిన కోట్ల జ్యోతికి ఇద్దరు పిల్లలు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. జీవనోపాధి కోసం ఆమె ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. పెద్ద కుమారుడు నరేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనకు 28 ఏళ్లు. ఇంకా తన తల్లి తనకు పెళ్లి ప్రయత్నాలు చేయడంలేదని బాధపడుతుండేవాడు.

Are you not getting married.. follow these tips to get married easily

ఇప్పటికే ఓ ఏడాది క్రితం తనకు పెళ్లి చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా. తల్లి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో మనస్తాపం చెందాడు. గురువారం పనిముగించుకుని వచ్చిన నరేష్ తల్లితో గొడవకు దిగాడు. గొడవ కాస్తా ముదిరింది.

అంతే.. విసురుగా బయటకు వెళ్లి యాసిడ్ సీసా కొనుక్కొచ్చుకుని ఇంటి పైకి వెళ్లి తాగేశాడు. నోటి నుంచి రక్తం కారుతూ కిందకు వచ్చేసరికి గమనించిన తల్లి తల్లి, తమ్ముడు ముందు ప్రైవేటు ఆస్పత్రికి.. ఆ తర్వతా గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. తండ్రిలేని ఆ కుటుంబానికి పెద్దన్నలా నిలవాల్సిన నరేశ్ పెళ్లి చేయటం లేదని యాసిగి మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచి వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news