వైసీపీకి ‘రెబల్’ టెన్షన్.!

-

ఎమ్మెల్యేలు కార్యకర్తలతో జగన్ నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి, సర్వే రిపోర్టులను బట్టి టికెట్లు ఇస్తానని చెప్పారు. టికెట్స్ ఇవ్వకపోయినా వేరే పదవులు ఇస్తామని కూడా వారికి వాగ్దానాలు చేశారు. కానీ పార్టీ అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యేగా ఉన్న తీరు వేరు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా పొందిన గౌరవం వేరు అని అంటున్నారు. ఆ గౌరవాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని ఎమ్మెల్యేలు  అంటున్నారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇప్పుడు తమకంటూ ప్రత్యేక క్యాడర్ ఉందనీ, ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా ఉందనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గతంలో లాగా తమకు నచ్చిన వారికి టికెట్ ఇస్తాము, లేదంటే కొత్త వారికి ఇస్తాము అని అధిష్టానం అంటే చూస్తూ ఊరుకోబోమని వైసిపి నాయకులు సొంత పార్టీ నేతల దగ్గరే అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారి సొంత పార్టీ పై పోటీ చేస్తే వైసీపీకి వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడుతుంది. అది  ప్రతిపక్ష పార్టీలకు లాభం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ రెబెల్ గా పోటీ చేయకపోయినా పార్టీలోనే ఉంటూ నిలబడిన అభ్యర్థిని ఓడించటానికి ప్రయత్నిస్తే వైసీపీకి గట్టి దెబ్బ అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నారు.

ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్లాయని అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగు వేయాలని ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు వారు అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే ఆశావహులు ఏం చేస్తారో?సిట్టింగులకు టికెట్ ఇవ్వకపోతే వారేం చేస్తారో?అని  ఎటు తేల్చుకొని స్థితిలో జగన్ ఉన్నారని అనుచర వర్గం చెబుతోంది. మరి జగన్ ఏమి చేస్తారో, ఎవరికి సీటు ఇస్తారో వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news