నేడు తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ప్రారంభం

-

డెయిరీ రంగంలో తెలంగాణను మరింత అభివృద్ధి మార్గంలో నడపడానికి రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెయిరీలు ఏర్పాటు చేసి పాడి రైతుల ప్రగతికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద నిర్మించిన తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ మెగా డెయిరీని ప్రారంభించనున్నారు.

రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటో మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు. నెలకు 30 టన్నుల వెన్న, రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మెగా డెయిరీ నిర్వహణ కోసం సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థతో పాటు.. వ్యర్ధాల వినియోగం ద్వారా తయారైన విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడం ప్రత్యేకత అని వెల్లడించింది. ఇవాళ మెగా డెయిరీ ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, తలసానిలతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news