హైదరాబాద్​లో నేటితో ముగియనున్న ఈసీ బృందం పర్యటన

-

హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ ఓటరు అవగాహనా కార్యక్రమాలపై ప్రదర్శనను ఈ బృందం తిలకించనుంది. దివ్యాంగ, యువ ఓటర్లు, లోకల్ ఐకాన్లతో మాట్లాడనున్న అధికారులు మాట్లాడనున్నారు. అనంతరం సీఎస్, డీజీపీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో భేటీ కానున్నారు. మరోవైపు.. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకుంటున్న డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రతి వారం సమగ్ర నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించింది.

ఓట్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల విషయంలో పదేపదే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని కమిషన్ ప్రశ్నించింది. తుది జాబితా తర్వాత కూడా  కొనసాగితే తీవ్రంగా పరిగణిస్తామని ఈసీ బృందం స్పష్టం చేసింది. ఎన్నికల్లో ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్లు సమాచారం. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని ఈ బృందం పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక ఇవాళ్టితో పర్యటన ముగియనున్న నేపథ్యంలో.. మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం మూడు రోజుల పర్యటన ముగించుకొని ఈసీ బృందం దిల్లీ బయల్దేరి వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news